డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దుల్లో మునిగితేలిన హీరో, హీరోయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దుల్లో మునిగితేలిన హీరో, హీరోయిన్

May 12, 2022

బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ – దీపికా పదుకొనేలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ప్రేమికులుగా ఉన్నప్పుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వీరిద్దరూ రామ్ లీల అనే సినిమా చేశారు. రోమియో – జూలియట్ కథ ఆధారంగా దర్శకుడు భారత నేటివిటీకి తగ్గట్టు చిత్రాన్ని మలిచారు. ఇందులో కథా నాయకా, నాయకీల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు మోతాదుకు మించి పోయాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని రొమాన్స్ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. రణవీర్ దీపికాలు తమ మధ్య వచ్చే ముద్దు సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు సీన్ అయిపోగానే దర్శకుడు కట్ చెప్పాడట. అయితే అప్పటికే నిజజీవితంలో ప్రేమలో ఉన్న ఇద్దరూ కూడా డైరెక్టర్ చెప్పిన మాట పట్టించుకోకుండా అలాగే కంటిన్యూ చేశారంట. ఈ విషయం గురించి రణవీర్‌ను ప్రశ్నించగా, ‘అప్పటికే మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. లిప్ లాక్ సీన్లలో నటించాలని దర్శకుడు చెబితే మేం అందులో జీవించేశాం’ అని బదులిచ్చారు. బాలీవుడ్‌లో ఇప్పుడీ విషయం గురించే చర్చించుకుంటున్నారు.