'మద్దాలి శివారెడ్డి' ఇంట్లో కరోనా కలకలం! - MicTv.in - Telugu News
mictv telugu

‘మద్దాలి శివారెడ్డి’ ఇంట్లో కరోనా కలకలం!

July 14, 2020

Actor ravi kishan assistant tested coronavirus positive

కరోనా మహమ్మారి నటీనటులను వెంటాడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎందరో నటీనటులు కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. తాజాగా నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. రవికిషన్ పర్సనల్ అసిస్టెంట్ కు కరోనా సోకింది. నా దగ్గర పని చేస్తున్న పీఏ గుడ్డూ పాండే(42) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయగా, అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. 

దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పీఏకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో రవికిషన్‌ కూడా కరోనా టెస్ట్‌లు చేయించుకొని హోమ్ క్వారంటైన్‌కి వెళ్ళారు. ఈయనకు ‘రేసుగుర్రం’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెల్సిందే. అందులో ఆయన నటించిన మద్దాలి శివారెడ్డి పాత్ర ఎంతో ఫేమస్ అయింది. ఇప్పటికీ ఆయనను సినీ అభిమానులు మద్దాలి శివారెడ్డి అని పిలుచుకుంటారు.