అదరగొట్టిన రేఖ.. రంగులరాట్నం నా తొలి తెలుగు మూవీ కాదు..   - MicTv.in - Telugu News
mictv telugu

అదరగొట్టిన రేఖ.. రంగులరాట్నం నా తొలి తెలుగు మూవీ కాదు..  

November 17, 2019

ఆరున్నర పదుల అందాల రేఖ.. చమత్కారాలు, ఉద్వేగాలతో తెలుగు జనాన్ని కట్టిపడేశారు. మాతృభాష అయిన తెలుగులో అనర్గళంగా మాట్లాడి మెప్పించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ రోజు జరిగిన ఏఎన్ఆర్ జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమం దీనికి వేదికైంది. 2018 ఏడాదికిగాను శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీ కపూర్, 2019కి గాను రేఖ మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. 

Actor rekha.

ఈ సందర్భంగా నాగార్జునతో రేఖ సరదాగా మాట్లాడారు. రంగులరాట్నం’(1966) రేఖ తొలిచిత్రం అని చెప్పారు. అయితే తన తొలిచిత్రం అది కాని రేఖ షాకిచ్చారు. ఇంటిగుట్టు’(1955) తన తొలిచిత్రం అని, అందులో ఏడాది పిల్లగా నటించానని అన్నారు. దీనికి నాగార్జున అంగీకరించకుండా.. తూచ్.. ఆ వయసులో చేసినదాన్ని లెక్కలోకి తీసుకోబోమన్నారు. అయితే తాను అందులో చక్కగా నటించానని, కావాలంటే ఆ చిత్రం చూడాలని రేఖ చెప్పింది. ఈ వయసులోనూ మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటని అడగ్గా, మీరు కూడా అంత వయసొచ్చిన అందంగానే ఉన్నారు కదా అని కౌంటర్ వేశారు. అందమనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది…అని అన్నారు. ఆర్ట్ సినిమాలను, కమర్షియల్ సినిమాలను ఎలా మేనేజ్ చేశారని అడగ్గా.. ఇదేంటి? క్వశ్చన్, ఆన్సర్స్ ఫంక్షనా.. అవార్డ్ ఫంక్షనా?’’ అని నవ్వుతూ విసుక్కున్నారు. తనకు నటించడమే తెలుసని, సినిమాల్లో తేడాలు చూడలేదన్నారు. .