'ఉదయ్‌ కిరణ్‌' బయోపిక్‌..స్పందించిన సందీప్‌ కిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఉదయ్‌ కిరణ్‌’ బయోపిక్‌..స్పందించిన సందీప్‌ కిషన్

November 27, 2019

actor sandeep kishan response about uday kiran biopic

ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల పర్వం నడుస్తోంది. ఇటీవల ‘జార్జిరెడ్డి’ బయోపిక్ విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెల్సిందే. తాజాగా దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవితంగా ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుందని..అందులో ఉదయ్ కిరణ్ పాత్రలో యువ నటుడు సందీప్ కిషన్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా సందీప్‌కిషన్‌ ఆ వార్తలను ఖండించారు. ‘గత కొన్నిరోజులుగా ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌పై రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌ గురించి ఇప్పటి వరకూ నన్ను ఎవరు సంప్రదించలేదు. ప్రస్తుతం నాకు బయోపిక్‌లలో నటించే ఆలోచన కూడా లేదు. ధన్యవాదాలు’ అని సందీప్‌ ప్రకటించారు. ప్రస్తుతం సందీప్‌కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ నటిస్తున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్‌ కిరణ్‌.. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.