Actor Shivaji criticized YS Jagan
mictv telugu

కొడితే చచ్చేదాకా కొట్టండి.. లేదంటే ఎవరూ బతకరు : హీరో శివాజీ

August 19, 2022

హీరో, నటుడు, ఒకప్పటి ‘ఆపరేషన్ గరుడ’ శివాజీ మళ్లీ పొలిటికల్ పంచులు పేలుస్తున్నారు. గత కొంతకాలంగా కనిపించడం మానేసిన శివాజీ.. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ మీటింగులో పాల్గొని సర్వేల పేరుతో కొత్త రాగం అందుకున్నారు. 42 నియోజకవర్గాలలో సర్వే చేయించానని సీఎం జగన్ పులివెందులలో వెయ్యి, రెండు వేల ఓట్లతో మాత్రమే గెలుస్తారని తేలిందన్నారు. ఇంకా అధికారంలోకి రావడం మాత్రం పక్కా, వచ్చిన తర్వాత పిచ్చ కొట్టుడు కొడతామని వార్నింగ్ ఇచ్చారు. ‘ఏం చేశామని మాపై కేసులు పెడుతున్నారు. దాంతో ఏమవుతుంది. మహా అయితే నాలుగేళ్లు తిప్పుతారు. దీని వల్ల ఏం ప్రయోజనం. సీఎం జగన్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతిపక్షాల మీద పడడం కాదు. దమ్ముంటే ప్రజలకు మేలు చేయండి. నాలాంటి వారి మీద కూడా దాడి చేస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నా. కొడితే చచ్చేదాక కొట్టండి. బతికితే మాత్రం నా .. ల్లారా ఎవరూ బతకరు. మీరెలా పుట్టారో మేమూ అలాగే పుట్టాం. మీకేం కొమ్ములు లేవు. మేం అధికారంలోకి వస్తే అదే పోలీసులు మా వెనకాల ఉంటారు. అప్పుడు మేం కొట్టించలేమా? కానీ, ఇది ప్రజాస్వామ్యం అని గుర్తంచుకోండి. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఏమీ అనదల్చుకోలేదు. కానీ, ప్రజలకు మంచి చేయమని అడుగుతున్నాం. ప్రశ్నిస్తున్నాం. వ్యవస్థలో లోపాలుంటే సరిచేయమని చెప్తున్నాం. మీరు మళ్లీ గెలుస్తామనే భ్రమలోంచి బయటకు రావాలి’ అని కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు.