Actor Shivaji Reaction On Rahul Gandhis Disqualification Slams Pm Modi
mictv telugu

Actor Sivaji : అలా ఎందుకు.. రాహుల్‎ను చంపేయండి.. నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

March 26, 2023

Actor Sivaji Sensational Comments On PM Modi Over Rahul Gandhi Disqualification

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే చంపేయాలని కానీ పార్లమెంట్‌కు రాకుండా అడ్డుకోవాడం సరికాదన్నారు. మోడీ విధానాలను ఎవరు హర్షించరన్న శివాజీ, రాహుల్ కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాహుల్ కోసం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.గాంధీ కుటుంబం కోసం, ఈ దేశం కోసం ఒకసారి కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని నినదించారు. అందరిలో కాంగ్రెస్ డిఎన్ఏ నే ఉందన్నారు.

కార్పొరేట్ చేతుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలన్నారు శివాజీ. ప్రజాస్వామ్య వ్యవస్థను మోదీ నాశనం చేశారని విమర్శించారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ నిర్మించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి బై బై చెప్పాలన్నారు . ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్న శివాజీ. డబ్బులు ఇవ్వకపోయినా ప్రజలు తెలుగుదేశానికి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోనే రాహుల్‌ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.