Actor Shriya's husband Andre kissed her in public
mictv telugu

ముద్దాడడం ఒక సరదా.. అది నా భర్తకు అర్ధం కాదు : నటి శ్రియ

November 23, 2022

Actor Shriya's husband Andre kissed her in public

ముద్దులపై సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. లిప్ కిస్ పెట్టుకోవడం అనేది ఒక రకమైన సరదా అని అభివర్ణించింది. బాలీవుడ్ లో తను తాజాగా నటించిన దృశ్యం-2 సినిమా విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రియా తన భర్తతో కలిసి హాజరైంది. ఈ క్రమంలో భర్త అండ్రీ కొచీవ్ శ్రియాను లిప్ కిస్ పెట్టుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో శ్రియా స్పందించారు. ‘ముద్దాడడం ఒక రకమైన సరదా.

నా రేర్ మూమెంట్స్ లో నన్ను ముద్దాడడం సాధారణ చర్య అని నా భర్త అనుకున్నాడు. సహజమైన చర్యను ట్రోల్ చేయడం ఎందుకో తనకు అర్ధం కాలేదు. నా వరకు ముద్దు అనేది అందమైనది. నేను చెత్త కామెంట్లు చదవను. ట్రోల్ చేయడం కొందరి ఉద్యోగం. వాటిని పట్టించుకోకపోవడం నా ఉద్యోగం. నేను చేయాలనుకున్నదే చేస్తాను’ అని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఇక దృశ్యం-2, ఆర్ఆర్ఆర్ సినిమాలపై భర్త స్పందన అడగ్గా.. ‘నా సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తాడు. కానీ వాటిని మరోసారి చూసి సరిగ్గా అర్ధం చేసుకోవాలని అతడి అభిప్రాయం’ అని స్పష్టం చేసింది. కాగా, బహిరంగంగా ముద్దు పెట్టడం పాశ్చాత్య దేశాల్లో ఓకే కానీ, భారత్ లాంటి సాంప్రదాయ దేశంలో అభ్యంతరకరంగానే ఉంటుంది. ఇది నచ్చని వారు సహజంగానే శ్రియాను తప్పుబడుతున్నారు. కాగా, అజయ్ దేవగణ్ హీరోగా నటించిన దృశ్యం-2 సినిమాలో శ్రియా కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం 5 రోజుల్లోనే రూ. 86 కోట్లు వసూలు చేసి ఘన విజయం దిశగా పయనిస్తోంది. తొలివారంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.