ఫోక్ సింగర్, నటి మునియమ్మ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

ఫోక్ సింగర్, నటి మునియమ్మ కన్నుమూత

March 29, 2020

Actor-singer Paravai Muniyamma passes away

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ జానపద గాయకురాలు, తమిళ నటి పరవై మునియమ్మ(83) కన్నుమూశారు. ఆదివారం మదురైలోని తన నివాసంలో మృతిచెందారు. 2003లో విక్రమ్ నటించిన ‘దూళ్’ చిత్రంతో నటిగా మునియమ్మ తమిళ సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ‘సింగం పోల’ అనే పాటతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మరియమ్మ సినిమాల్లో బిజీగా మారారు. అనేక సినిమాల్లో తన గాత్రాన్ని వినిపించారు. దూళ్‌ సినిమాతో పాటు తోరనై కోవిల్‌, మాన్‌ కరాటే, వీరమ్‌ తదితర తమిళ చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. సుమారుగా 80 తమిళ చిత్రాల్లో ఆమె నటించారు. 

సినిమాలతో పాటు పలు టీవీ షోలు కూడా చేసి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతంలో అనారోగ్యంతో బాధపడుతున్న మునియమ్మకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రూ.6 లక్షలు సాయం చేశారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసి ప్రతి నెల ఆరు వేల రూపాయలను భృతిగా అందజేస్తున్నారు. కాగా, మునియమ్మ భర్త గతంలోనే మృతి చెందారు. ఆమెకు నలుగురు కుమారులు, ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. మునియమ్మ అంత్యక్రియలు మధురైలో ఆదివారం సాయంత్రం జరగుతాయి.