కరోనా కాటు.. పళ్లు అమ్ముకుంటున్న నటుడు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కాటు.. పళ్లు అమ్ముకుంటున్న నటుడు

May 22, 2020

Actor

లాక్‌డౌన్ దెబ్బతో ప్రజల జీవితాలు అస్థవ్యస్థంగా మారాయి. పనిలేక చేతికి డబ్బులు రాక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించే స్థాయికి వెళ్లిపోయాయి. దీని ప్రభావం సినిమా రంగం మీద కూడా ఎక్కువగానే పడింది. దీంతో ఉపాధి లేక కార్మికులు జీవితాలను నెట్టుకురాడానికి కొత్త పంతా ఎంచుకోక తప్పడం లేదు. ఇలాగే ఓ నటుడికి కూడా తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. మొఖానికి రంగు వేసుకొని  కెమెరా ముందు నటించిన ఆ వ్యక్తి ఇప్పుడు మండే ఎండలో పండ్లు అమ్ముతూ జీవనం సాగించాల్సి వచ్చింది. 

ఎన్నో సినిమాల్లో కీలక నటుడిగా ఉన్న సోలంకి దివాకర్‌కు ఈ పరిస్థితి వచ్చింది. ఆయన ముంబైలో పళ్లు అమ్ముతూ కనిపించాడు. లాక్‌డౌన్ దెబ్బతో కుటుంబ పోషణ భారమై ఆ వృత్తి చెప్పట్టినట్టుగా వెల్లడించారు. సోలంకి దివాకర్ ఇండస్ట్రీకి రాక ముందు  పండ్లు, కూరగాయలు అమ్ముకునేవారు. ఆ తర్వాత సినిమాల్లో బిజీగా మారడంతో వాటి అవసరం లేకుండా పోయింది. కానీ కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడంతో డబ్బులు లేక తిరిగి తన వృత్తికి వెళ్లిపోయాడు. కాగా బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డ్రీమ్ గార్ల్ చిత్రంలో ముఖ్య పాత్ర ఆయన నటించారు. హల్క, హవా, టిట్లీ, కడ్వి హవా, సోంచారియా వంటి సినిమాల్లో కూడా మెప్పించారు.