మరో 28 వేల మందికి సోనూ సూద్ ఆపన్నహస్తం - MicTv.in - Telugu News
mictv telugu

మరో 28 వేల మందికి సోనూ సూద్ ఆపన్నహస్తం

June 4, 2020

Sonu Sood

నిన్న మొన్నటి వరకు వలస కూలీలను సురక్షితంగా స్వస్థలాలకు పంపడంలో బిజీగా ఉన్న నటుడు సోనూ సూద్.. ప్రస్తుతం మహారాష్ట్రను పొంచిఉన్న నిసర్గ తుఫాన్ పై దృష్టి సారించారు. 

తాజాగా ముంబయి తీర ప్రాంతంలోని సుమారు 28 వేలమందికి ఆహారం అందించాడు. అలాగే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశాడు. నిసర్గ తుపాను ముంచుకు వస్తోందన్న వార్తలతో తన బృందం అప్రమత్తమైందని, తీర ప్రాంత ప్రజల ఆకలి తీర్చడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాల్లోని కాలేజీలు, పాఠశాలలకు తరలించామని సోనూ సూద్ తెలిపారు. అలాగే నిసర్గ తుపాను కారణంగా ముంబయిలో చిక్కుకుపోయిన 200 మంది అస్సామీ వలస కూలీలను షెల్టర్ కేంద్రాలకు తరలించామని చెప్పారు.