actor srikanth divorce rumors viral in social media
mictv telugu

ఊహకి విడాకులు.. హీరో శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్

November 22, 2022

సెలబ్రెటీల జీవితాలు మనకి కనిపించేదానికి విరుద్ధంగా ఉంటాయి. క్రేజ్, గ్లామర్ తో బయట హడావిడి చేసినా.. వారి తెరవెనుక జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి. సాధ్యమైనంత వరకు ఒడిదుడుకులని సీక్రెట్ గా పెట్టుకుని సమయం చూసుకుని ఓపెన్ అవుతారు. అయితే సోషల్ మీడియా జమానాలో ఏది దాయటం సాధ్యమవ్వటం లేదు. బెడ్ రూమ్ లో జరిగే సంగతులు కూడా లీక్ అయిపోతున్న నేటి రోజుల్లో సెలబ్రెటీల వైవిహిక జీవితాలపై రోజుకొక పుకార్లు బయటకొస్తున్నాయి. చాలా వరకు రూమర్స్ కరెక్ట్ అవుతున్నా..కొని తలతోకే లేనివిగా ఉంటాయి. తాజాగా తన వివాహబంధంపై వస్తున్న షాకింగ్ కథనాలను కూడా అలాంటివేనా.. లేక నిజముందా అన్నదానికి క్లారిటి ఇచ్చాడు హీరో శ్రీకాంత్. అందరివాడిలా తెలుగు చిత్రపరిశ్రమలో శ్రీకాంత్ కి మంచి పేరుంది. సినిమాలే జీవితంగా శ్రీకాంత్ కెరీర్ సాగుతుంది. ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీలో శ్రీకాంత్ పేరు లేదు.

అయితే తాజాగా పాతికేళ్ల క్రితం తానూ ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఊహతో విభేదాలు వచ్చాయని.. అవి తారాస్థాయికి చేరాయని.. ఊహకి శ్రీకాంత్ విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడని ఏవేవో వార్తలు కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ డివోర్స్ రూమర్స్ పై స్పదించాడు శ్రీకాంత్. నేను, నా భార్య ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నామని, మీమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని కొందరు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఈ వార్తలో అస్సలు నిజం లేదని, అవన్నీ పుకార్లేనంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే హీరో శ్రీకాంత్ దంపతులు విడాకులు అంటూ వస్తున్న వార్తలపై శ్రీకాంత్ క్లారిటీ ఇవ్వడంతో ఈ ఫేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.