శ్రీకాంత్ కొడుకు హీరోగా 'పెళ్లిసందడి'! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాంత్ కొడుకు హీరోగా ‘పెళ్లిసందడి’!

October 27, 2020

 pelli sandadi

నటుడు మేక శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా మరో సినిమా రూపొందుతోంది. 1996లో వచ్చిన ‘పెళ్లిసందడి’ సినిమా రీమేక్‌లో రోషన్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ ట్విట్టర్‌లో ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి ప్రముఖ నిర్మాత కె కృష్ణమోహన్ రావు నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించనున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి బాణీలు సమకూర్చుతున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. 1996లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించిన సంగతి తెల్సిందే. అప్పట్లో ఆ సినిమా సంచలన విజయం సాధించింది. శ్రీకాంత్, ఊహ దంపతుల తనయుడు రోషన్ గతంలో నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు.