టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాద్రయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన నటుడు తారకరత్న ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. నారాయణ హుదయాలయ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో అతడి వైద్యం కొనసాగుతంది. తారకరత్న భార్య, కుమార్తె కుప్పం చేరుకున్నాక..వారి నిర్ణయం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి బెంగళూరుకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
జరిగింది ఇదే..
గత కొంత కాలంగా టీడీపీలో పార్టీ కార్యక్రమాల్లో నటుడు తారకరత్న చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్రకు హాజరయ్యారు. లోకేష్‌తో పాటు కాసేపు నడిచారు. అయితే కొద్ది దూరం నడిచాక ఆయన ఒక్క స్పృహ తప్పిపోడియారు. వెంటనే అతడిని స్థానిక కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. తారకరత్నను పరిశీలించిన వైద్యులు గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించి అవసరమైన వైద్యాన్ని అందించారు. గుండెలో 90 శాతం బ్లాక్ అవ్వడాన్ని గుర్తించారు. తొలి రోజు పాదయాత్ర ముగిశాక రాత్రి 8.20 గంటల సమయంలో లోకేశ్ ఆసుపత్రి వద్దకు చేరుకుని తారకరత్నను పరామర్శించారు.బాలకృష్ణ పార్టీ నేతలతో కలిసి ఆస్పత్రి వద్దే ఉన్నారు.
జూ.ఎన్టీఆర్ ఆరా
బెంగళూరు, కుప్పం ఆస్పతి వైద్యులతో చంద్రబాబు ఎప్పటికప్పుడు మాట్లాడి తారకతర్న వైద్యంపై ఆరా తీశారు. విషయంతో తెలుసుకున్న జూ.ఎన్టీఆర్ కూడా బాలయ్యకు ఫోన్ చేసారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుప్పం ఆస్పత్రికి ఎన్టీఆర్ వస్తారని ప్రచారం కూడా జరిగింది. నేడు బెంగుళూరు ఆస్పత్రికి జూ.ఎన్టీఆర్ వెళ్లే అవకాశం ఉంది.