ఆ నలుగురే రేప్ చేశారా?..నటుడు ఉపేంద్ర అనుమానం - MicTv.in - Telugu News
mictv telugu

ఆ నలుగురే రేప్ చేశారా?..నటుడు ఉపేంద్ర అనుమానం

December 8, 2019

upendra

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు పోలీసుల చర్యను సమర్దిస్తే.. మరికొందరు విమర్శిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఎన్కౌంటర్‌పై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర చేసిన ట్వీట్‌ ఒకటి వైరల్ అవుతోంది. ఉపేంద్ర పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర ట్విట్టర్‌లో స్పందిస్తూ..’ఆ నలుగురే దిశపై అత్యాచారం చేసి కాల్చి చంపారా? ప్రముఖుల విషయంలో ఈ రకమైన ఎన్‌కౌంటర్‌లు ఎందుకు జరగడం లేదు? కోర్టు విచారణ పూర్తి కాకపోముందే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం సరికాదు. ఒకప్పుడు ఎన్‌కౌంటర్‌ల ద్వారా రౌడీయిజం తగ్గిపోయిన మాట వాస్తవమే. నిజాయితీ కలిగిన అధికారులు దృష్టిపెడితే ఎన్‌కౌంటర్‌ల ద్వారా మహిళలపై అత్యాచారాలను నివారించవచ్చు. కానీ, ధనవంతులు, ప్రముఖులు దీనిని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఉపేంద్ర ట్వీట్‌కు కొందరు మద్దతు తెలుపుతుండగా, చాలా మంది ఆయన మాటలను ఖండిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ రాజకీయ నటుడిగా, స్టార్‌ హీరోగా ఉపేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మెజారిటీ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.