actor vikrams dhruva natchathiram movie latest update
mictv telugu

ఎప్పుడో మొదలైన సినిమా ఇప్పుడు విడుదల అవుతోంది

February 8, 2023

actor vikrams dhruva natchathiram movie latest update

ఏడేళ్ళ క్రితం మొదలెట్టిన ఒక సినిమా ఇప్పడు రిలీజ్ కు సిద్ధమైంది. కొన్ని సినిమాలు ఉంటాయి. అవి మొదలైన డేట్ కి, రిలీజ్ అయిన డేట్ కి అసలు సంబంధమే ఉండదు. ఎన్నో అడ్డంకులను దాటుకుని విడుదల అయ్యేసరికి మధ్యలో కొన్నేళ్ళు గడిచిపోతాయి. సాధారణంగా ఇలా చిన్న, లో బడ్జెట్ మూవీస్ కు జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీలో హీరో చాలా పెద్దవాడు, డైరెక్టరూ బాగా పేరున్నవాడే. హీరో చియాన్ విక్రమ్ అయితే దర్శకుడు గౌతమ్ మీనన్. ఇంతటి స్టార్ కాస్ట్ ఉన్న సినిమా ఎందుకింత ఆలస్యమైంది తెలుసుకుందాం రండి.

ధృవనక్షత్రం అనే సినిమా 2016లో మొదలైంది. దీనికి గౌతమ్ మీనన్ దర్శకుడు, నిర్మాత కూడా. ఈ మూవీకి చాలాసార్లు బ్రేక్ పడింది. దానికి కారణం గౌతమ్ మీనన్ నిర్మాతల్లో ఒకరు కావడమేనట. మధ్యలో అతని సినిమాలు డిజాస్టర్ కావడం, విక్రమ్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవడం, అలాగే గౌతమ్ మీననా క్యారెక్టర్ ఆర్టిస్ట్ బిజీ అయిపోవడం ఇలా రకరకాల కారణాలు వల్ల సినిమా మాత్రం పూర్తి కాలేదు. కర్ణుడికి చావుకు సవాలక్ష కారణాలు అంటే ఇదేనేమో.

పీఎస్-1 సినిమా తర్వాత విక్రమ్ మార్కెట్ కాస్త పెరిగిందిట. ఆ కారణంతోనే ధృవనక్షత్రాన్ని మళ్ళీ సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఇప్పడు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. డేట్ అయితే ఫిక్స్ కాలేదు కానీ సమ్మర్ లో రిలీజ్ అవుతుందని టాక్. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అట. ఇన్ని ఏళ్ళ తర్వాత, జనాలు మర్చిపోయాక వస్తున్న ఈ సినిమా ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.