వెంకన్న సన్నిధిలో శర్వానంద్, రష్మిక! - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్న సన్నిధిలో శర్వానంద్, రష్మిక!

October 25, 2020

tirumala

నటీనటులు శర్వానంద్, రష్మికా మందన్నా ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని  దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో వచ్చిన వీరికి ఆయల అధికారులు దర్శనం చేయించారు. ఆపై ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందించారు. 

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.