Actress Aindrila Sharma Boyfriend Kisses Her Feet At Funeral
mictv telugu

హీరోయిన్ పాదాలను ముద్దాడుతూ.. శవం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన బాయ్‌ఫ్రెండ్

November 24, 2022

బెంగాలీ హీరోయిన్ ఐంద్రిలా శర్మ విషాద మరణం ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 24 ఏళ్ల బెంగాలీ నటి ఐంద్రిలా శర్మ రెండుసార్లు క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడినా.. మొన్న గుండెపోటుతో మరణించింది. బెంగాలీలో పలు చిత్రాలో నటించిన ఐంద్రిలా చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకుని కెరీర్‌లో దూసుకెళ్తుండగా మరణించడాన్ని అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నసమయంలో.. ఆమెని ప్రాణంగా ప్రేమించిన ప్రియుడి బాధ అయితే వర్ణనాతీతం. ఆమెని చివరిసారిగా చూస్తూ విలవిలలాడిపోయాడు. ఇటీవల ఆమె అంత్యక్రియల్లో ఐంద్రీలా బాయ్‌ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి భావోద్వేగానికి గురయ్యాడు. బాధతో ఆమె శవాన్ని పట్టుకుని విలపించిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది.

 

ఐంద్రిలా శర్మకి అన్ని వేళలా తోడునీడగా ఉన్న సబ్యసాచి చౌదరి ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు. అంత్యక్రియల్లో ఆమె కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇక సబ్యసాచి ఐంద్రీలా పాదాలను ఆఖరిసారిగా ముద్దు పెట్టుకుంటున్న వీడియో అందరిని కలిచివేస్తోంది. ఆమె ఆసుపత్రిలో చేరినప్పుడి నుండి ఐంద్రిలానే అంటిపెట్టుకుని ఉన్నాడు సబ్యసాచి. ఆమె ఆరోగ్యం కోసం దేవుళ్లను ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ ఇన్‌స్టాగ్రామ్‌లో వేడుకున్నాడు. హౌరాలోని నారాయణ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ 2022 నవంబర్ 20, ఆదివారం మధ్యాహ్నం కన్నుమూసింది ఐంద్రిలా. ఇక ఆమె మరణించినందుకు చింతిస్తూ, సబ్యసాచి తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ తొలగించారు. దివంగత నటి ఐంద్రీలా అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి : నీకు చాలా పొగరు – వెన్నెల కిషోర్ విషెష్ పై మంచు విష్ణు ఫైర్

ఇది కూడా చదవండి : ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు – మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్