నటి అమలా పాల్ ఇంట విషాదం...  - MicTv.in - Telugu News
mictv telugu

నటి అమలా పాల్ ఇంట విషాదం… 

January 22, 2020

bbbbbjh

ప్రముఖ నటి అమలా పాల్ ఇంట్లో విషాదం నెలకొంది. అమలా పాల్ తండ్రి వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 

తండ్రి మరణంతో సినిమా షూటింగ్ బిజీలో ఉన్న అమలా పాల్ హుటాహుటిన చెన్నై నుంచి కేరళ వెళ్ళింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేరళలోని కురుప్పంపూడిలో ఉన్న కాథలిక్ చర్చ్‌లో పాల్ వర్గీస్ అంత్యక్రియలు జరగనున్నాయి. అమలా పాల్ తండ్రి మృతి పట్ల సినీలోకం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.