దాదాపు ఎనిమిదేళ్ల నుండి ప్రేక్షకులను అలరిస్తోన్న కామెడీ షో జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు దూరమవుతున్నారు. తాజాగా బజర్దస్త్ యాంకర్ అనసూయ కూడా షో నుండి తప్పుకోనుందని టాక్ వినిపిస్తోంది. జబర్దస్త్‌తో పేరు సపాదించుకున్న తర్వాత ఎంతోమంది కమెడియన్లకు సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో.. చాలామంది కమెడియన్లు ఒక్కొక్కరిగా షోను వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా ఈ షోను వీడారు. ఇంతలోనే యాంకర్ అనసూయ కూడా షో నుండి తప్పుకోనుందని వార్తలు వస్తున్నాయి.
అనసూయ.. ఓవైపు జబర్దస్త్ యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేసింది. తాను చేసిన ఒకట్రెండు చిత్రాలు కూడా తనకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక మరోవైపు ఇతర ఛానెళ్ల నుండి కూడా అనసూయకు పిలుపు రావడంతో అప్పుడప్పుడు సింగింగ్ షోలలో కూడా తళుక్కుమని మెరిసింది. ఇక జబర్దస్త్ షో నుండి దూరమవుతున్నట్లుగా ఓ పోస్ట్ కూడా షేర్ చేసింది అనసూయ. ‘నా కెరీర్ గురించి పెద్ద నిర్ణయం తీసుకున్నాను. అది ఈరోజు అమలు చేశాను. నేను నాతో పాటు చాలా జ్ఞాపకాలను తీసుకెళ్తున్నాను. అందులో చాలావరకు మంచిది.. కొన్ని చెడ్డవి ఉన్నాయి. కానీ జీవితం నాకోసం ఇంకా దాచిపెట్టిందో చూడాలనుకుంటున్నాను. ఎప్పటిలాగానే మీరు కూడా నాతో పాటు ప్రయాణిస్తారు అనుకుంటున్నాను.’ అని అనసూయ చేసిన పోస్ట్.. తాను జబర్దస్త్ మానేస్తుంది అనేదానికి సంకేతంగా కనిపిస్తోంది. అయితే జబర్ధస్త్ కామెడీ షో ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు ఓపెన్‌గా కామెంట్ చేస్తున్నారు.