Actress Andrea Jeremiah talks about her bitter childhood experiences
mictv telugu

బస్సులో నా టీషర్ట్ లోపల చేయి పెట్టాడు : హీరోయిన్ ఆండ్రియా

November 16, 2022

గాయనిగా, నటిగా, హీరోయిన్‌గా దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న ఆండ్రియా జెర్మియా తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఓపెన్ అయింది. ఓ తమిళ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. ‘నాకు పదకొండేళ్లప్పుడు నాన్నతో కలిసి బస్సులో వెళ్తున్నా. ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం. సడెన్‌గా ఓ చేయి నా వీపును తాకింది. నాన్నేమో అనుకున్నా. కానీ, ఆ చేయి టీషర్ట్ లోపలికి వెళ్లడంతో నాన్న వంక చూశా. ఆయన రెండు చేతులు ముందర వేసుకుని ఉన్నారు. ఆ చేయి మళ్లీ లోపలికి వెళ్లడంతో నేనే కాస్త ముందుకు జరిగి కూర్చున్నా. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పలేదు. బహుశా అప్పుడు ఉన్న సామాజకి కట్టుబాట్లతో చెప్పలేదేమో. చెప్పి ఉంటే నాన్న ఆ వ్యక్తికి తగిన బుద్ది చెప్పేవారు. ఇంకోసారి కాలేజ్ బస్‌లో ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి బిగ్గరగా అరుస్తూ ఐ లవ్ యూ చెప్పాడు. అన్నీ చూసి వదిలేయడం తప్ప ఏం చేయలేం. ఇలాంటివి నా జీవితంలో చాలా జరిగాయి’ అంటూ చెప్పకొచ్చింది.