తెలుగు అమ్మాయి కానీ తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ అంజలి. మొదటి సినిమా షాపింగ్ మాల్ తోనే మంచి పేరు తెచ్చుకుంది. తరువాత స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుని పాపులర్ అయింది. వాటితో పాటు మధ్యమధ్యలో ఐటెమ్ సాంగ్స్ కూడా చేస్తూ లైమ్ లైట్ లో ఉంది. ప్రస్తుతం శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్సీ 15 మూవీలో నటిస్తోంది అంజలి. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో దీని మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. సినిమా హిట్ అయితే అంజలికి మంచి పేరు రావడం గ్యారంటీ.
పెళ్ళి వయసు వచ్చి చాలా కాలమైన హీరోయిన్లలో అంజలి ఒకరు. తన పెళ్ళి మీద చాలానే రూమర్లు వచ్చాయి. బోలెడు అమ్మడి పెళ్ళి అంటూ వార్తులు కూడా వచ్చాయి. అయితే అంజలి వాటిని ఎప్పటికప్పడు ఖండిస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఆర్సీ 15 తర్వాత పెళ్ళి ఖాయం అంటూ వస్తున్న వార్తలు మాత్రం నిజమే అంటున్నాయి సినిమా వర్గాలు. అంజలి కోసం ఆమె తల్లిదండ్రులు సంబంధాలు వెతుకుతున్నారుట. మ్యాచ్ సెట్ అయితే కనుక ఈ ఏడాది చివర్లో అంజలి పెళ్ళి పీటలు ఎక్కుతుంది.
మీరోయిన్ అంజలి మీద చాలానే రూమర్లు వచ్చాయి. వ్యక్తిగతంగా కూడా ఆమెను చాలా వివాదాలు వెంటాడాయి. కుటుంబంతో గొడవలు, పోలీస్ కేస్, కిడ్నాప్ అంటూ మధ్యలో కొంత గొడవ జరిగింది. అప్పట్లో అవి చాలా సంచలనం కూడా అయ్యాయి. దాని తర్వాత తమిళ్ హీరోతో డేటింగ్ అంటూ వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే అంజలి మాత్రం వీటి మీద పెద్దగా ఎప్పుడూ స్పందించలేదు. బరువు పెరిగి కొంతకాలం సినిమాలు చేయలేకపోయిన అంజలి సన్నగా మారి ఇప్పుడు మళ్ళీ వరుసపెట్టి సినిమాలు చేస్తోంది.