actress anu emmanuel angry on reporter questions about dating with hero allu sirish
mictv telugu

అల్లు హీరోతో సహజీవనం.. నటి అను ఇమ్మాన్యుయేల్ అసహనం

October 22, 2022

అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అను బ్యూటీ కెరీర్ సాగుతుంది. ఆకట్టుకునే అందం, కట్టిపడేసే అభినయం రెండు ఉన్నా ఇప్పటివరకు సరైన బ్రేక్ దొరకలేదు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని వంటి స్టార్ హీరోలతో నటించినా కెరీర్ లో మలుపు లేదు. మజ్ను, నా పేరు సూర్య, అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్స్ అను ఇమ్మాన్యుయేల్ ని కోలుకోలేని దెబ్బకొట్టాయి. అయితే సినిమాల్లో క్రేజ్ లేకున్నా సోషల్ మీడియాలో ఒక స్పైసీ గాసిప్ తో ట్రెండ్ అవుతూ ఉంటుంది అను బ్యూటీ. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరిష్ తో డేటింగ్ వార్తలతో తెగ వైరల్ అవుతుంది అను. కొద్దిరోజులుగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని కూడా కథనాలు వస్తున్నాయి. అందుకే వీరిద్దరూ కలిసి చేస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంలో హాట్ సీన్స్ తో రెచ్చిపోయారని, బాలీవుడ్ స్థాయిలో వీరి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎంత క్లోజ్ అయితే ఇలాంటి కెమిస్ట్రీతో బోల్డ్ సీన్స్ చేస్తారంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక నవంబర్‌ 4న ‘ఉర్వశివో రాక్షసివో’ విడుదలకు సిద్ధం అవుతుండటంతో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ లు ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు. అయితే వీరిద్దరికి సినిమా కంటే ఎక్కువగా డేటింగ్ అంశంపైనే ప్రశ్నలు అడుగుతుంది మీడియా. ఇప్పటికే అల్లు శిరీష్ డేటింగ్ వార్తలని ఖండించాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయబద్దమైన సమాధానం చెప్పేశాడు. అయితే తాజాగా ఇదే ప్రశ్న హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ సైతం ఎదురవ్వడం ఆమె కాస్త అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేస్తూ అను తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘అల్లు అర్జున్ తో వర్క్ చేశారు అలాగే అల్లు శిరీష్ తో కూడా కలిసి పనిచేశారు. ఇద్దరిలో క్యూటెస్ట్ ఎవరు..? నాటీ ఎవరు..?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘వేరే ప్రశ్నలేవీ లేవా అడగడానికి..? మంచి ప్రశ్నలు అడగండి’ అంటూ కౌంటర్‌ వేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.దీనిపై స్పందించాలని అడిగితే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటూ తప్పించుకుంది నటి అను ఇమ్మాన్యుయేల్.