actress anupama strong punch to hero siddu jonnalagadda
mictv telugu

ముదిరిన వివాదం.. డీజే టిల్లుకి అనుపమ స్ట్రాంగ్ పంచ్

December 1, 2022

డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. తనదైన యాస, భాష, యాటిట్యూడ్ తో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. క్రిటిక్స్ ప్రశంసలతో పాటు డీజే టిల్లుకి కాసుల వర్షం కురిసింది. దాంతో ఇండస్ట్రీలో టాప్ 10 హీరోల జాబితాలో సిద్దు చేరిపోయాడు. అయితే వచ్చిన సక్సెస్ ని తలకి ఎక్కించుకున్నాడన్న అపవాదుని కూడా సిద్దు తెచ్చుకుంటున్నాడు. ఈ ఆరోపణల్లో నిజం ఎంతుంతో కానీ జరుగుతున్న వరుస పరిణామాలు అలానే కనపడుతున్నాయి. డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ని తెరకెక్కిస్తున్నాడు సిద్దు. డీజే టిల్లులో తన హాట్ లుక్స్ తో అదరగొట్టిన నేహాశెట్టికి ఈ సీక్వెల్ లో అవకాశం ఇవ్వకుండా హీరోయిన్ శ్రీ లీలకి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆమె మూవీ నుండి అర్దాంతరంగా తప్పుకుంది. వెంటనే ఆమె స్థానంలో కార్తికేయ 2 తో హిట్ కొట్టిన అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వన్ తీసుకున్నారు. త్వరలో షూటింగ్ కూడా అనౌన్స్ చేశాక.. అనుపమని సైతం టిల్లు స్క్వేర్ నుండి తప్పించారు.

అయితే ఇదంతా సిద్దు జొన్నలగడ్డ యాటిట్యూడ్ కారణంగానే అంటూ రూమర్స్ వస్తున్నాయి. కథ, క్యాస్టింగ్ విషయంలో సిద్దు అతిగా ఇన్వాల్వ్ అవుతున్నాడని.. ఇది నచ్చకనే హీరోయిన్స్ తప్పుకుంటున్నారని వదంతులు వచ్చాయి. అయితే హీరోయిన్స్ తప్పుకోవడానికి రెమ్యునరేషన్ కారణమని మూవీ టీమ్ కవరింగ్ చేస్తూ వచ్చినా.. తాజాగా డీజే టిల్లుకి పంచ్ ఇస్తున్నట్టు అనుపమ పరమేశ్వరన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ‘ఒక చోట ఎగ్జిట్ అయితే మరో చోట ఎంట్రీ ఉంటుంది’ అంటూ ఒక అవకాశం కోల్పోతే మరో అవకాశం రెడీగా ఉంటుంది అని అనుపమ కామెంట్స్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో ఓ పిక్ పోస్ట్ చేస్తూ ఈ కామెంట్ జోడించింది. అనుపమ చేసిన ఈ కామెంట్స్ డీజే టిల్లు 2 గురించే అని అర్థం అవుతోంది. దీన్ని బట్టి అనుపమ మీరు నన్ను సినిమా నుండి తేసివేసినా నాకు అవకాశాలు బాగానే ఉన్నాయని పరోక్షంగా సిద్దు కు పంచ్ ఇచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.