కన్నడలో చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా కలెక్షన్లతో దుమ్మురేపిన చిత్రం కాంతార. రిషబ్ షెట్టి దర్శక హీరోగా వచ్చిన ఈ చిత్రంలో తుళు ప్రాంతానికి చెందిన భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 400 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా విజయం సాధించినప్పుడు ఆ ప్రాంతానికే చెందిన హీరోయిన్ అనుష్క స్పందిస్తూ తన చిన్నతనంలో భూతకోలను చూశానని, ఆ సాంప్రదాయం ఆధారంగా తెరకెక్కిన కాంతార విజయం సాధించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించింది. తాజాగా అనుష్క భూతకోల వేడుకల్లో పాల్గొంది. ఈ కార్యక్రమానికి హాజరై దైవం ఆశీర్వాదం తీసుకుంది. భూతకోల పక్కన ఉండి తిలకించిన ఆమె.. తన సెల్ ఫోన్ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీయడం కనిపించింది. దీంతో కన్నడతో పాటు తెలుగు అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha
— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022
ఇవి కూడా చదవండి
చించేసిన అవతార్.. 3600 కోట్లతో తగ్గేదేలా..
‘ఆ’ నిర్మాతను కలిసిన నటికి సింగర్ చిన్మయి వార్నింగ్
ఒక్క ముక్కలో.. రామ్ చరణ్ పై షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్