Home > Featured > వెబ్ సిరీస్ లో కులదూషణ..అనుష్కకు లీగల్ నోటీసులు

వెబ్ సిరీస్ లో కులదూషణ..అనుష్కకు లీగల్ నోటీసులు

Anushka Sharma

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 'పాతాల్ లోక్' అనే వెబ్ సిరీస్ కు సహనిర్మాతగా వ్యవహరించిన సంగతి తెల్సిందే. ఈ వెబ్ సిరీస్ లో తమ కమ్యూనిటిని దూషించారని గోర్ఖా కమ్యూనిటీ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ అంశమై ఇటీవల ఆమెకు లీగల్ నోటీసులు అందాయి. ఈ వెబ్ సిరీస్ లో ఓ కులాన్ని ప్రస్తావిస్తూ దూషణ జరిగిందని ఆరోపణ ప్రణయ్ రాయ్ & అసోసియేట్స్‌కు చెందిన లాయర్ వీరేన్ శ్రీ గురుంగ్.. అనుష్కకు లీగల్ నోటీసులు పంపారు.

ఈ వెబ్ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ లో గోర్ఖా కమ్యూనిటీ మొత్తాన్ని అవమానిస్తున్నట్లుగా ఉందని.. గురుంగ్ ఆరోపిస్తున్నారు. 'లేడీ పోలీస్ ఆఫీసర్ విచారణ జరుపుతున్న సమయంలో నేపాలీ క్యారెక్టర్ ను కమ్యూనిటీ మొత్తాన్ని దూషించేలా ఓ పదం వాడుతుంది. అందులో తప్పేం లేకపోయినా అక్కడ నేపాలీ అనే పదాన్ని కూడా కలుపుతుందని అతడు తెలిపాడు. దీనిపై అనుష్క శర్మ స్పందించాల్సి ఉంది.

Updated : 20 May 2020 12:12 PM GMT
Tags:    
Next Story
Share it
Top