హీరోయిన్ అర్చన ఇంట్లో సంగీత్ సందడి.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

హీరోయిన్ అర్చన ఇంట్లో సంగీత్ సందడి.. (వీడియో)

November 12, 2019

టాలీవుడ్ హీరోయిన్ అర్చన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. జగదీశ్ భక్తవత్సలం అనే బిజినెస్‌మెన్‌తో ఈ నెల 14వ తేదీన ఆమె పెళ్లి జరగనుంది. దీంట్లో భాగంగా ఆమె ఇళ్లు బంధువులతో కళకళలాడుతోంది. సోమవారం రాత్రి సంగీత్ కూడా సందడిగా నిర్వహించారు. బంధువులు, మిత్రులు, సన్నిహితుల మధ్య ఈ నవ జంట ఆడిపాడి కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

నేను సినిమాతో 2004లో హీరోయిన్‌గా పరిచయం అయిన అర్చన పలు  తెలుగు,కన్నడ,తమిళ సినిమాల్లోనూ నటించించారు. అయితే పెద్దగా హిట్లు లేకపోవడంతో కొంత కాలం సీని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తర్వాత బిగ్‌బాస్ సీజన్ 1లో ఆమె ఎంట్రీ చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాధించుకున్నాడు. ఇటీవల సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా సినిమాలో అర్చన నటించిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా జగదీశ్‌తో ప్రేమలో ఉన్న ఆమె మరి కొన్ని గంటల్లో జీవిత భాగస్వామి కాబోతున్నారు. ఈనెల 14న హైదరాబాద్‌లో జరిగే ఈ పెళ్లికి పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.