టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టిల పెళ్లి సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దోళ్ల పెళ్లి కాబట్టి విశేషాలు కూడా పెద్దగానే ఉన్నాయి. ముఖ్యంగా అతియా పెస్టల్ కలర్ లెహంగా ధరించి దేవకన్యలా మెరిసిపోయింది. ఈ లెహంగాపై అటు అభిమానులతోపాటు ఇటు ఫ్యాషన్ రంగంలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. ‘బావుంది, అద్భుతం’ అని కొందరు అంటుంటే మరికొందరు ఒకపూట పెళ్లికి ఇంత హడావుడా అని ఆశ్చర్యపోతున్నారు. దీన్ని డిజైన్ చేసి అనామికా ఖన్నా లెహంగా గురించి చాలా వివరాలు చెప్పారు. ‘‘దీన్ని తయారు చేయడానికి 10 వేల గంటలు పట్టింది. 416 రోజులు తీసుకున్నాం.
అతియా వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉండేలని ఇంత శ్రమతీసుకుని తయారుచేశాం. దీన్ని పూర్తిగా చేత్తోనే తయారు చేశారు. జర్దోజీ వర్క్, జూలీ వర్క్ కలిపాం. ఇది ప్రేమ కోసం పడిన కష్టం’’ అని అనామిక అన్నారు. అయితే ధర మాత్రం చెప్పలేదు. సంవత్సరానికిపైగా, 10వేల గంటలు పాటు కష్టపడ్డారంటే లెహెంగా ఖరీదు ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురైన అతియా 2009 ఐదేళ్లుగా రాహుల్‌తో డేటింగ్ లో ఉంది. పెద్దలు ఒప్పేసుకోవడంతో పెళ్లయిపోయింది.