Actress bhanupriya suffering from memory loss
mictv telugu

మెమరీ లాస్‌తో బాధపడుతున్న భానుప్రియ

February 4, 2023

 

Actress bhanupriya suffering from memory loss

1980, 90 దశకాల్లో తెలుగు వెండితెరకు కొత్త సొగసు, సరికొత్త నటన పరిచయం చేసిన భానుప్రియ కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. భర్త చనిపోయాక బయటికే రావడం లేదు. ప్రాధాన్యం లేని అమ్మ, అమ్మమ్మ, వదిన వంటి పాత్రలే వస్తుండడం, చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో వెండితెరకు, బుల్లితెరకు దూరమయ్యారు.

తాజాగా ఆమె తనకు మతిమరపు వచ్చిందని మళ్లీ వార్తల్లోకి వచ్చారు. విషయాలు గుర్తుండడం లేదని, డైలాగ్స్ మర్చిపోతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కోలుకోవడానికి మందులు వాడుతున్నానని తెలిపారు. ‘‘మెమరీ లాస్ వచ్చింది. నృత్యభంగిమలు, హస్తముద్రలు మర్చిపోయాను. ఓ తమిళ మూవీ షూటింగులో డైలాగులు మర్చిపోయా. మైండ్ లాస్ అయింది. ఆరోగ్యం బాలేదు.

డాన్స్ స్కూల్ పెట్టాలని ఇదివరకు అనుకున్నాను ఇప్పుడది సాధ్యంకాదు’’ అని అన్నారు. దాంపత్య జీవితంపై స్పందిస్తూ.. తాను భర్తతో చివరిరోజుల వరకు కలసి ఉన్నానని స్పష్టం చేశారు. తాము విడిపోయినట్లు వస్తున్నవార్తలు కేవలం పుకార్లేనని కొట్టిపడేశారు. తన కూతురు అభినయ లండన్‌లో చదువుకుంటోందని, ఆమెకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. రాజమండ్రి దగ్గర్లని రంగంపేటలో జన్మించిన భానుప్రియ ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్ ను పెళ్లాడారు.