Actress Bhumi Pednekar's look in a revealing bralette blouse and saree gets TROLLED
mictv telugu

‘భూమి.. పోర్న్ ఇండస్ట్రీలో ట్రై చేయ్.. ఫ్యూచర్ ఉంటుంది’

December 2, 2022

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్స్‌లో భూమి పెడ్నేకర్ ఒకరు. తన మూపీ అప్డేట్స్‌తో పాటు హాట్ హాట్ ఫోటోస్‌ను కూడా షేర్ చేస్తుంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని చెక్ చేస్తే ఆ విషయం అర్థం అవుతుంది. తాజాగా భూమి పెడ్నేకర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అద్భుతమైన బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. సొగసైన చీరలో మెరిసింది కానీ.. ఆమె ధరించిన బ్లౌజ్ మాత్రం విచిత్రంగా ఉంది. అది బ్లౌజా, బ్రానా అనే అనుమానం కలిగేలా ఉంది.

చీర కొంగుని కాస్త పక్కకి జరిపి.. ఎద సోయగాలతో అందాలు ఆరబోసింది. కళ్ళు చెదిరేలా ఉన్న ఆ ఒంపు సొంపులు మతి పోగేట్టేలా ఉన్నాయి. తన బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కోసం ఈ కాస్ట్యూమ్ లో మెరిసినట్లు భూమి కామెంట్ లో పేర్కొంది. ఈ రేంజ్‌లో భూమి పెడ్నేకర్ అందాలని గతంలో ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదనే చెప్పాలి. భూమి పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలా హాట్‌గా ఉందని కొందరు అంటుంటే.. మరికొందరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘పోర్న్ ఇండస్ట్రీలో ట్రై చెయ్.. మంచి ఫ్యూచర్ ఉంటుంది..’’అని , ‘ఉర్ఫీ జావేద్ 2.0’’అని, ‘‘ కొంచెమైనా సిగ్గు ఉండాలి’ వంటి కామెంట్‌లు పెడుతున్నారు. ఇంకొంతమంది ఇవేవీ పట్టించుకోకుండా మత్తు చూపులతో కుర్రాళ్ళని ఉడికించాలంటే భూమి పెడ్నేకర్ తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేస్తున్నారు.

2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. తన పాత్రలు బోల్డ్ గా ఉన్నప్పటికీ వైవిధ్యం ఉండాలని భవిస్తుంది ఈ భామ.