Actress Catherine As Lady Villain In Pushpa 2 Movie
mictv telugu

పుష్ప2లో ఆ మహిళ ఎమ్మెల్యే ?

November 21, 2022

ప్రాంతీయ చిత్రంలా విడుదలై పాన్ ఇండియా మూవీగా సంచలనాలు సృష్టించింది పుష్ప. హిందీలో పుష్పకి ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. సౌత్ కంటే నార్త్ లో పుష్ప భారీ హిట్ కొట్టింది. బాలీవుడ్ మాస్ బెల్ట్ అంతా పుష్పకి నీరాజనాలు పలికింది. అలాంటి పుష్పకి కొనసాగింపుగా పుష్ప2ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. పుష్ప బ్లాక్ బస్టర్ తో పుష్ప2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ప్రతి విషయంలో భారీతనం ఉండేలా సుకుమార్ ప్రణాళికలు రచిస్తున్నారు. అసలు కథ అంతా పుష్ప2లో ఉంటుంది కనుక పాత్రల ఎంపికపై ఆచితూచి అడుగులేస్తున్నారు. పుష్ప దాదాపు 400కోట్లు వసూల్ చేయగా.. పుష్ప2కి 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంది టీమ్. ఇందులో భాగంగా చిన్న పాత్రలకు సైతం పేరున్న స్టార్స్ ని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తుంది.

ఈ సినిమా లో ఇప్పటికే అనసూయ లేడి విలన్ పాత్ర చేయగా.. మరో నెగటివ్ షేడ్స్ ఉన్న లేడి పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ని పరిశీలిస్తున్నారట. ఆమె మరెవరో కాదు ‘యూ ఆర్ మై ఎమ్మెల్యే’ పాటలో.. బన్నీతో చిందులేసిన హీరోయిన్ కేథరిన్ తెర్సా. సరైనోడులో ఈమె ఎమ్యెల్యే పాత్రని చేసింది. మళ్ళీ ఆమె పేరునే బన్నీ పుష్ప2లో లేడి విలన్ పాత్రకి సజెస్ట్ చేశాడట. పుష్ప 2 లో మరో లేడి విలన్ పాత్రని సుకుమార్ క్రియేట్ చేశాడని.. ఆ పాత్రకు గాను కేథరిన్ తెర్సా ను ఎంపిక చేశారని… ఒక పవర్ ఫుల్ కాప్ కమ్ నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో ఆమెను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. అల్లు అర్జున్ కేథరిన్ కాంబినేషన్ లో అన్ని హిట్స్ ఉండటంతో.. ఆ సెంటిమెంట్ తోనే ఆ లేడీ విలన్ పాత్రకు కేథరిన్ అయితే బాగుంటుందని బన్నీ సూచించి ఉంటాడన్న ప్రచారం జరుగుతోంది.