టీడీపీ నుంచి బయటకొచ్చాక పనికిమాలిన చెత్త వెధవలు నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అహర్నిశలు పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు లేకనే బయటకు వచ్చేశానన్నారు. పార్టీకోసం నిజాయితీగా పనిచేసిన తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చెందారు. టీడీ జనార్దన్ కోవర్టులతో తప్పులు చేస్తున్నారని, టీడీపీ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. టీడీ జనార్థన్ రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే.. టీడీపీ పార్టీ టీడీజే పార్టీగా మారబోతుందంటూ జోస్యం చెప్పారు.
“టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు గారికి.. లోకేష్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే.. నిజానిజాలు మీకు తెలియాలనే నేను అన్నీ బయటకు తీస్తున్నా తప్పితే.. మాపై నిందలు వేయించుకోవడానికి కాదు. దయచేసి ఇలాంటి చెత్త వెధవల్ని కంట్రోల్ చేయండి.. నీతి నియమాలతో పనిచేసిన వాళ్లపై నిందలు వేయడం భావ్యం కాదు. పార్టీలో ఉన్నప్పుడూ, పార్టీ వదిలి బయటకు వచ్చేసిన తరువాత కూడా హింస పెడుతున్నారు. నిజాలు బయటకు వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ” అని దివ్యవాణి అన్నారు. ఇలాగే కొనసాగితే తెలంగాణలో టీడీపీకి ఏ పరిస్థితి వచ్చిందో ఏపీలో అదే పరిస్థితి వస్తుందని అన్నారు.