నటి ‘బీఫ్’ ఫొటోపై వివాదం - MicTv.in - Telugu News
mictv telugu

నటి ‘బీఫ్’ ఫొటోపై వివాదం

September 9, 2017

జాతీయ ఉత్తమ నటి, ప్రసిద్ధ మలయాళ తార సురభి లక్ష్మి.. ఓ హోటల్లో బీఫ్ తింటూ తీయుంచుకున్న ఫొటో ఒకటి కేరళలో గొడవలు రేపుతోంది. ఆమె మలయాళీల ఓనం పండగ రోజున ఎద్దుమాంసం తినిందని హిందుత్వ శక్తులు తిట్టిపోస్తున్నాయి. అయితే తాను ఓనం పండగకు మూడు వారాల ముందే బీఫ్ తిన్నానని, ఆ ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశానని సురభి చెబుతోంది. ఈ ఫొటోను ఓనం పండగ రోజున ఓ టీవీ చానల్ ప్రసారం చేయడంతో దుమారం రేగింది. సురభి  ఎన్నివివరణలు ఇచ్చినా సోషల్ మీడియాలో ఆమెపై దాడులు ఆగడం లేదు.  ‘బాగా ఆకలేసి హోటల్ కు వెళ్లాను. నేను ఏం తింటున్నానో నాకే తెలియలేదు. తింటున్నది  బీఫా? చికెనా? పంది మాంసమా? అని ఆలోచించలేదు. నాకు ఆకలి తీరాలి.. అంతే.. ఆ ఫోటోను చానల్ వాళ్లు సందర్భశుద్ధి లేకుండా.. కేవలం రచ్చ చేయడానికి ప్రసారం చేశారు.. ’ అని సురభి మండిపడుతోంది.