దేశ ముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి హన్సిక తర్వాత కోలీవుడ్‌లో బాగా ఫేమస్ అయ్యింది. డిసెంబర్ 4 2022న తన స్నేహితుడు సొహైల్‌ని పెళ్లి చేసుకొని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ పెళ్లి వీడియో లవ్ షాదీ డ్రామా పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా తన పెళ్ళికి ముందు వచ్చిన రూమర్లపై క్లారిటీ ఇచ్చింది హన్సిక. ‘నా పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నా. కానీ మీడియాకు లీక్ అయ్యింది. ఒక సెలబ్రిటీగా అది నేను చెల్లించుకున్న మూల్యం. ఇక సొహైల్ గురించి రాసినప్పుడు ఒత్తిడికి గురయ్యా. అతని మొదటి పెళ్లి ఫోటోల్లో నేను ఉండడాన్ని షేర్ చేస్తూ విడాకులకు కారణం నేనేనని ట్రోల్ చేశారు. అతని గతం నాకు తెలుసు. కానీ విడాకులకు కారణం నేను కాదు. అలాగే గతంలో నేను కూడా ఓ వ్యక్తితో (శింబు?) రిలేషన్‌లో ఉన్నాను.
కానీ అదిచ్చిన చేదు అనుభవం వల్ల అలాంటివి నాకు పనికిరావని అర్ధమైంది. అప్పుడే అనుకున్నా. నా తర్వాతి ప్రేమ నా భర్తతోనే ఉండాలని. అందుకే పెళ్లి చేసుకొని ఫోటోలు షేర్ చేశా. పరిస్థితులు కలిసి రానప్పుడు నా తల్లి ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది’ అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత వచ్చిన మార్పు ఏంటనే ప్రశ్నకు ‘ఇంటి పేరు, అడ్రస్ మారింద’ని తెలిపింది.