Actress Hema Fires On Media Reporter
mictv telugu

ఇంద్రకీలాద్రిపై నటి హేమమ్మవారి చిందులు.. అతనికి వేలి చూపి..

October 4, 2022

సినిమాల కంటే వివాదాలతో నిత్యం వార్తలకు ఎక్కుతూ ఉంటుంది నటి హేమ. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు, రాజకీయాలు, క్యాస్టింగ్ కౌచ్ ఇలా ఏ వివాదంలో అయినాదూరేస్తుంది. కౌంటర్లతో అటాక్ చేస్తుంది. ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా బోల్డ్ కామెంట్స్ కూడా చేస్తుంటుంది. తాజాగా బెజవాడ కనక దుర్గమ్మవారి దర్శనంలో అలా హల్ చల్ చేసింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడకు వచ్చిన ఆమె.. దుర్గమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతర ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడింది. ఆమెను ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై చిందులు తొక్కింది. అనవసరంగా కాంట్రవర్సీలు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.

దర్శనం అనంతరం హేమ మీడియాతో ముచ్చటిస్తూ.. ‘పవిత్ర దసరా నవరాత్రి సీజన్‌లో అమ్మవారి దర్శనం చేసుకోవటం నా అదృష్టం. విపరీతంగా జనాలు వస్తుండంతో.. ప్రోటోకాల్ సమస్యలతో ఈ సారి దర్శనం అవుతుందో కాదోనని భయమేసినా దర్శనం బాగా జరిగింది. అమ్మవారి దర్శనానికి నోచుకోని వారికోసం ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి గురించి మీడియా లైవ్ చూపిస్తు భక్తులకు పుణ్యం దక్కేలా చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది.

హేమ వెళ్లిపోయేముందు.. ఓ రిపోర్టర్ ‘మేడం మీరు ఎంత మంది వచ్చారు.. అందరిలా ప్రోటోకాల్ ఫాలో అయ్యి.. టికెట్ కొనుక్కునే వచ్చారా?’ అని ప్రశ్నించాడు. దీంతో హేమ సహనం కోల్పోయింది. అమ్మవారి గుడి అని మరిచి అతనిపై మండిపడింది. ‘నేను ప్రోటోకాల్ ఫాలో అయ్యే వచ్చాను. టికెట్ కొనుక్కొని వచ్చాను. హుండీలో రూ.10 వేలు కూడా వేసాను. అమ్మవారికి రూ.20 వేల రూపాయల చీర తెచ్చాను. ఎందుకు ఈ విషయాన్ని కాంట్రావర్సీ చేస్తున్నారు?’ అంటూ ఆమె తీవ్ర స్వరంతో వేలు చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏదేమైనా తాము చెప్పిందే వినాలి, ఎదురు ప్రశ్నలు వేయోద్దన్న వైఖరి సెలబ్రెటీల్లో ఈ మధ్య ఎక్కువవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.