డిగ్రీ అర్హత పరీక్ష రాసిన సినీనటి హేమ - MicTv.in - Telugu News
mictv telugu

డిగ్రీ అర్హత పరీక్ష రాసిన సినీనటి హేమ

September 27, 2020

HEMAA

చదువుకు వయసుతో సంబంధం లేదు అంటారు. అలాగే కళకు చదువుతో ఆస్కారం లేదు అంటారు. అయినా ఆ సీనియర్ నటి డిగ్రీ అర్హత పరీక్ష రాసింది. చక్కగా సినిమాలు, బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలు చేస్తున్న ఆమె డిగ్రీ పరీక్ష రాసి అబ్బుర పరిచింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ నటి హేమ. విద్యార్హతలు పెంచుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని.. చదువుకోవాలనే పట్టుదల ఉంటే సరిపోతుందని నిరూపించారామె. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న ఆమె.. అర్హత పరీక్షను ఆదివారం నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో రాసింది. ఆమెను చూడటానికి జనాలు ఎగబడ్డారు. 

ఈ విషయమై హేమ మాట్లాడుతూ.. ‘ఎప్పటినుంచో డిగ్రీ చేయాలని ఉంది. హైదరాబాద్ అయితే ఇబ్బంది ఉంటుందని నల్గొండలో పరీక్ష రాశాను. ఎవరి కంటా పడకూడదని అనుకున్నా. కానీ మీడియా కంట పడ్డాను. ఇలా జరుగుతుందనే ఇక్కడ పరీక్ష రాసేందుకు వచ్చాను’ అని హేమ తెలిపింది. ప్రస్తుతం తాను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నానని, నల్లగొండ అయితే ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉండటంతో ఇక్కడ పరీక్షలు రాస్తున్నానని వివరించింది. హైదరాబాద్‌లో కరోనా కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండటంతో నల్గొండ అయితే బాగుంటుందని చెప్పింది. ఈ ప్రాంతంలో తమకు బంధువులు కూడా ఉన్నారని తెలిపింది.