నాకు ‘ఏడుపు రోగం’ ఉంది : స్టార్ హీరో కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

నాకు ‘ఏడుపు రోగం’ ఉంది : స్టార్ హీరో కూతురు

May 2, 2022

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (మొదటి భార్య రీనా దత్తా) కూతురు, మోడల్ ఐరా ఖాన్ తనకు ఏడుపు రోగం ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. గతంలో రెండు నెలలకు ఒకసారి వచ్చేదని, కానీ, ఇప్పుడు రోజూ వస్తుందని చెప్పింది. వ్యాధి లక్షణాలను ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ‘గతంలో ఎన్నడూ లేనంత యాంగ్జైటీ నన్ను పట్టి పీడిస్తోంది. దీని వల్ల హృదయ స్పందనలు సరిగ్గా ఉండవు. కంటిన్యూగా ఏడుపు వస్తుంది. కొన్ని సార్లు ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేం. ఈ లక్షణాలు ఒకేసారి అటాక్ అయి ఏదో జరిగిపోతోంది అని అనిపిస్తుంది. అస్సలు నిద్ర పట్టి చావదు. నాలో నేనే మాట్లాడుకుంటున్నా. డాక్టర్‌ని కలిసి సలహా అడిగితే సమస్య వచ్చినప్పుడు మొదట్లోనే పరిష్కరించుకోవాలన్నారు. అద్దంలో చూస్తూ మాట్లాడడం, సరిగ్గా ఊపిరి తీసుకోవడం మీద ధ్యాస పెట్టడం లాంటివి చేస్తే రోగం నుంచి కొద్దిగా దూరం జరగవచ్చు. కానీ, తర్వాత మళ్లీ వచ్చే అవకాశమూ ఉంటుంది. ఇదంతా బహిరంగంగా ఎందుకు చెప్తున్నానంటే.. నాలాంటి వారు సమాజంలో ఉంటే వారికి ఉపయోగపడుతుందని చెప్తున్నా. జీవితం అంటే ఎన్నో రకాల సమస్యలు కదా’ అంటూ ముగించింది.