actress jayasudha got married third time
mictv telugu

62ఏళ్ళ వయసులో.. జయసుధ రహస్య పెళ్లి..!

January 13, 2023

actress jayasudha got married third time

మాములు సినిమా గాసిప్సే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంటాయి. అలాంటిది సినీ తరాల వ్యక్తిగత విషయాలు, రహస్యాలు వంటివి రాకెట్ స్పీడ్ తో వైరల్ అవుతుంటాయి. ఒకప్పుడు ఎక్కువగా ఫేక్ వార్తలు వచ్చేవి కానీ ఈ మధ్య 90శాతం రూమర్స్ కాలక్రమేనా నిజమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక షాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సహజ నటి జయసుధ వ్యక్తిగత వార్త ఒకటి తెగ వైరల్ గా మారింది. అయితే ఇందులో నిజమెంతుందో కానీ తమిళ మీడియా ఎక్కువగా ఈ రూమర్ ని స్ప్రెడ్ చేస్తుంది. అదే జయసుధ మూడో పెళ్లి వార్త. ఆమె ఇటీవలే రహస్యంగా మూడవ పెళ్లి చేసుకున్నట్టు న్యూస్ వస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించిన జయసుధ తన రీఎంట్రీలోనూ స్టార్ హీరోలకు తల్లిగా అద్భుతమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పుడు వారసుడు సినిమాలో విజయ్‌కి తల్లిగా నటించి అలరించింది.

అయితే కెరీర్ పరంగా ఈమెకి ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకులే. కెరీర్ బిగినింగ్ లో వ్యాపారవేత్త కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌ ని మొదటి వివాహం చేసుకున్న జయసుధ మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత 1985లో ఆమె బాలీవుడ్‌ హీరో జితేంద్ర కపూర్‌ బంధువైన నితిన్‌ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు నిహాన్‌ కపూర్‌, శ్రేయాస్‌ కపూర్‌ పుట్టారు. అయితే 2017లో నితిన్‌ కపూర్‌ బిల్డింగ్‌ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి అందరు జయసుధ ఒంటరిగా ఉంటున్నట్టు అనుకున్నారు. కానీ ఆమె ఎప్పుడో మూడవ పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటుందని తాజాగా తెలుస్తుంది. ఓ తమిళ బిజినెస్‌ మ్యాన్‌ ని జయసుధ రహస్యంగా వివాహం చేసుకుని.. పబ్లిక్ ఈవెంట్స్ కి కూడా భర్తతో హాజరవుతున్నట్టు చెప్తున్నారు. మూడవ భర్తతో మొన్న ఆలీ కూతురు పెళ్ళికి కూడా హాజరైందని.. అలాగే వారసుడు తమిళ ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా భర్తతోనే జయసుధ వచ్చినట్టు చెప్తున్నారు.