Actress Jayasudha sensational comments on Tollywood
mictv telugu

టాలీవుడ్‌పై నటి జయసుధ సంచలన వ్యాఖ్యలు.. కుక్కలకు రూమేంటి?

July 30, 2022

సహజ నటి జయసుధ తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు ఇవ్వని నిర్మాతలు.. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లకు మాత్రం స్థాయికి మించి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. వారి కుక్కలకు కూడా ప్రత్యేక రూంలను కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కేంద్రం ప్రకటించే పద్మశ్రీ అవార్డులకు మేం పనికిరామా? అని ప్రశ్నించారు. ఇక షూటింగ్ సమయంలో హీరోల డామినేషన్ ఉండదనీ, కానీ వారి పక్కనుండే బ్యాచ్ హడావుడి ఇబ్బందికరంగా అనిపిస్తుందని వెల్లడించారు. కొన్నిసార్లు హీరోలకు డ్యాన్సులు రాకపోయినా, మమ్మల్నే అంటారని వారి హిపోక్రసీని ఎండగట్టారు. నటిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న జయసుధ.. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే ఇన్నేళ్లు పరిశ్రమలో ఉండనిచ్చేవారు కాదని అభిప్రాయపడ్డారు. అటు బాలీవుడ్‌లో అయితే సన్మానం చేసేవారనీ, కానీ, ఇక్కడ కనీసం పూల బొకే కూడా పంపించరని నిర్వేదం వ్యక్తం చేశారు. హీరోల కంటే హీరోయిన్లను చిన్న చూపు చూస్తారని అభిప్రాయపడ్డారు.