ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఆమె భర్త గౌతమ్ కిచ్లూ, సోదరి నిషా అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. అయితే పుట్టిన ఒకరోజుకే బాబుకు పేరు పెట్టేశాడు బాబు తండ్రి గౌతమ్ కిచ్లూ. ఈ విషయాన్ని నిషా అగర్వాల్ తన ఇన్స్టాగ్రాం అక్కౌంటులో పోస్ట్ చేసింది. ‘నీల్ కిచ్లూ’గా బాబుకు పేరు పెట్టినట్టు తెలిపింది. కాగా, కాజల్ అగర్వాల్‌తో పాటు నిషా అగర్వాల్ కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా పెళ్లిళ్లు చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటున్నారు. కాగా, 2020 అక్టోబర్ 20న కాజల్ వివాహం జరుగగా, వివాహం అయిన 17 నెలలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
View this post on Instagram