బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ భార్య ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. బాజీగర్, కుచ్ కుచ్ హోతాహై, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే వంటి బ్లాక్ బస్టర్స్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి కాజోల్ అజయ్ తో పెళ్లి తరువాత సినిమాలను తగ్గించేసింది. కానీ చాలా సంవత్సరాల తరువాత.. నటి కాజోల్ 2022లో త్రిభంగ చిత్రంతో డిజిటల్ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత వెంటనే హిట్ షో ‘ది గుడ్ వైఫ్’ హిందీ రీమేక్ కి సైన్ చేసింది. ఈ సిరీస్ షూటింగ్ తాజాగా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కాజోల్ కి జోడిగా నటించిన బ్రిటీష్-పాకిస్థానీ నటుడు అలీ ఖాన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాజోల్ తో రొమాంటిక్ సీన్స్ చేశానని రివీల్ చేశాడు.
తనకి కాజోల్ అంటే క్రష్ అని.. అలాంటి తన అభిమాన హీరోయిన్ తో సన్నిహిత సన్నివేషాల చిత్రీకరణని గుర్తుచేసుకున్నాడు ఖాన్. ‘గత మూడు దశాబ్దాలుగా నేని ఆమెకి వీరాభిమానిని. ఇన్నాళ్లకు ఆమెతో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. అది కూడా రొమాంటిక్ సీన్ లో. తన చిన్ననాటి క్రష్ కి ఫ్రెంచ్ కిస్ పెట్టాలి. అది కూడా కాజోల్ భర్త అజయ్ దేవగన్ సొంత బ్యానర్ లో నిమిస్తున్న ప్రాజెక్టు. ముంబైలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ కిస్ సీన్ షూట్. ఆ రోజు అజయ్ షూట్ కి రాలేదు. ఆ హోటల్ లో మేము రెండు సెకండ్స్ లో కిస్ సీన్ షూట్ పూర్తి చేశాం. అయితే అంతకు ముందు రెండు, మూడు సార్లు ప్రాక్టీస్ చేశాం. షాట్ లో ఒకే టేక్ లో కిస్ పూర్తి చేసినందుకు కాజోల్ థాంక్యూ డార్లింగ్ అని మెచ్చుకుంది’ అంటూ ముంబై హోటల్ గదిలో కాజోల్ తో జరిగిన ముద్దు సన్నివేశం చిత్రీకరణ విశేషాలు చెప్పాడు పాకిస్తాన్ నటుడు అలీ ఖాన్.