లైంగిక వేధింపుల వల్లే నటనకు దూరం.. ‘మళ్లీ మళ్లీ’ కల్యాణి
తమిళనటి కల్యాణి సినీ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపుల వల్లే తాను నటనకు దూరమయ్యానని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తొలి సినిమా తర్వాత వరుసపెట్టి అవకాశాలు వచ్చాయని, కానీ వారంతా లైంగికంగా వేధించే వారని చెప్పారు. అప్పట్లో జరిగిన విషయాలను ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నట్టు చెప్పారు.
‘ప్రభుదేవాతో కలిసి ‘అలై తండా వానమ్’ సినిమా తర్వాత నాకు మంచి అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మా అమ్మకి ఫోన్ చేసి సినిమాల్లో నటించాలంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని చెప్పేవారు. వారి మాటలతోనే నేను సినీ రంగానికి దూరమయ్యాను’ అని వెల్లడించారు. చెప్పారు. ఆ తర్వాత సీరియళ్లలో నటించినా అక్కడ కూడా వేధింపులు తప్పలేదని పేర్కొన్నారు. దీంతో పూర్తిగా నటనకు స్వస్తి చెప్పానని తెలిపారు. కాగా కల్యాణి.. జయం, అలై తండా వానమ్,ఎస్ఎంఎస్తో పాటు తెలుగులో ‘మళ్లీ మళ్లీ’ సినిమాలో నటించారు.