యాంకర్ సుమ ఇంట్లో విషాదం..ఆడపడచు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

యాంకర్ సుమ ఇంట్లో విషాదం..ఆడపడచు మృతి

April 6, 2020

Actress kanakala sreelakshmi passed away

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు దేవదాస్ కనకాల-లక్ష్మి దేవి కనకాలల కూతురు, రాజీవ్ కనకాల అక్క శ్రీలక్ష్మి కనకాల ఈరోజు మృతి చెందారు.

శ్రీలక్ష్మి కనకాల తెలుగు టెలివిజన్ నటి. దూరదర్శన్ లో వచ్చిన ‘రాజశేఖర చరిత్రము’ అనే సిరియల్ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమెకు గతంలో క్యాన్సర్ ఎటాక్ కాగా ఆమె దాని నుంచి కోలుకున్నారు. ఆమె ఆకస్మిక మృతితో కనకాల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు గతంలో ఏపీ మాజీ మంత్రి లోకేష్ కి తెలుగు ట్యూటర్ గా పనిచేశారు. శ్రీలక్ష్మీ మృతి పట్ల నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.