సినీ నటి కరాటే కల్యాణి సంచలన విషయం బయటపెట్టింది. నడిరోడ్డుపై ద్రౌపది తరహాలో తనకు వస్త్రాపహరణ జరిగిందని షాకింగ్ ఇన్సిడెంట్ వెల్లడించింది. తనలో అందరూ బాబీనే చూస్తారని, కానీ తనలో మరో యాంగిల్ కూడా ఉందని తెలిపింది. బోల్డ్ పాత్రలు, బిగ్ బాస్ 4 తో గుర్తింపు తెచ్చుకున్న కరాటే కల్యాణి.. బ్రహ్మానందంతో చేసిన సినిమా వల్ల మాస్ లో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఎప్పుడూ ముక్కుసూటిగా, గంభీరంగా మాట్లాడే కల్యాణి తన మనసులో ఇన్నాళ్లు దాచుకున్న బాధను ఓ ఇంట్వర్వ్యూలో వెళ్లగక్కింది. తనకు జరిగిన అనుభవాలు, మాజీ భర్తతో చేదు సంఘటనలను నెమరువేసుకుంది. ‘నాలో అందరూ బాబీనే చూస్తారు. బతుకుదెరువు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను. సినిమాల్లో బోల్డ్ గా కనిపించే నేను నిజ జీవితంలో ఎంతోమందికి సహాయం చేశాను.
పర్సనల్ విషయానికి వస్తే పెళ్లయ్యాక కష్టాలు అనుభవించాను. మాజీ భర్త పెట్టిన టార్చర్ మాటల్లో చెప్పలేను. అదెంతవరకు వెళ్లిందంటే.. బేగంపేటలో ఓ రోడ్డుపై అందరూ చూస్తుండగా నా బట్టలు లాగేశాడు. కచ్చితంగా చెప్పాలంటే ద్రౌపది వస్త్రాపహరణ జరిగింది. ఇదేకాక ఇలాంటివి చాలా జరిగాయి. సహనంతో భరించినా భర్తలో ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత విడాకులు తీసుకున్నాం. ఇప్పటికీ నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉంది’ అంటూ తన మనసులోని భావాలను పంచుకుంది.