కరిష్మా కపూర్.. ఈ పేరు వింటే 90ల్లో పుట్టినవారికి ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. తన సినిమాలతో ఆ కాలంలో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన హీరోయిన్ ఈమె. నటనతో పాటు డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసే టాలెంట్ ఈమె సొంతం. బడా హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి క్లాసిక్ హిట్స్ అందుకున్నారు. నీలికళ్లతో అభిమానులను కట్టిపడేసే కరిష్మాకు.. నిజ జీవితంలో చేదు అనుభవాలు ఉన్నాయి. 2003లో వ్యాపారవేత్త అయిన సంజయ్ కపూర్ ని పెళ్లి చేసుకున్న కరిష్మా.. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు.
ఆ సయమంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. కరిష్మా తన భర్త, అత్తమామలపై వరకట్న కేసు కూడా పెట్టింది. విడాకులు మంజూరు చేసిన కోర్టు పిల్లల సంరక్షణను మాత్రం తల్లికే అప్పగించింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ రాజ్ కపూర్. కాగా, విడాకులకు అసలు కారణాన్ని కరిష్మా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘మా అత్తగారు నాకో డ్రెస్ బహుమతిగా ఇచ్చింది. అబ్బాయి కియాన్ పుట్టిన తర్వాత దాన్ని ఓ సారి వేసుకోమన్నారు. తల్లినయ్యాక నా శరీరం సహజంగానే లావైంది. అందుకని ఆ డ్రెస్ నాకు పట్టలేదు. దాన్ని చూసిన భర్త సంజయ్ కోపంతో నన్ను కొట్టమని తల్లికి చెప్పాడు. అతడిని తప్పుపట్టాల్సిన తల్లి కొడుకుకే సపోర్ట్ చేసింది’ అంటూ గతానుభవాన్ని నెమరు వేసుకుంది. కాగా, ఈమె చెల్లెలు కరీనా కపూర్ అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించి సైఫ్ అలీఖాన్ ని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.