actress Kasthuri's frank opinion on K.L. Rahul's underwear pics
mictv telugu

కేఎల్ రాహుల్ అండర్ వేర్‌పై సీనియర్ హీరోయిన్ కామెంట్స్

June 1, 2022

actress Kasthuri's frank opinion on K.L. Rahul's underwear pics

బుల్లితెరపై వస్తున్న గృహలక్ష్మీ సీరియల్ గురించి చాలామందికి తెలిసే ఉంటంది. ఈ సీరియల్‌లో తులసి పాత్రలో నటిస్తున్న సీనియర్ హీరోయిన్ కస్తూరి.. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా KL రాహుల్ ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించాడు. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ధారణంగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత క్రికెటర్లు గానీ ఇలాంటి యాడ్స్ చేయడానికి ఇష్టపడరని.. కానీ రాహుల్ మాత్రం ధైర్యం చేసి ఈ యాడ్ చేశాడని తెలిపింది. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

“క్రికెటర్లు మాములుగా కూల్ డ్రింక్స్, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, దుస్తుల బ్రాండ్లకు ప్రచారం చేయడం చూస్తుంటాం. కానీ లోదుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు మాత్రం వారు సిగ్గుపడుతూ పెద్దగా ముందుకురారు. కానీ రాహుల్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా అండర్ వేర్స్ యాడ్ చేశాడు. రాహుల్‌ను ఈ బాక్సర్లలో చూడటం చాలా బాగుంది. ఇది పురుషుల దుస్తులకు సంబంధించి వారి ఆలోచనల నుంచి బయటకు తీసుకువస్తుందని నమ్ముతున్నాను” అని కస్తూరి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.