actress katrina kaif remembered about huge fight in her wedding
mictv telugu

కత్రినా పెళ్ళిలో పెను అలజడి.. ఆలస్యంగా వెలుగులోకి

November 10, 2022

సల్మాన్ ఖాన్ తో సూదీర్గ ప్రేమని పక్కనపెట్టి యువ హీరో విక్కీ కౌషల్ ని పెళ్లాడింది కత్రినా కైఫ్. తన కెరీర్ కి గాడ్ ఫాదర్ లా నిలబడ్డ సల్మాన్ కి హ్యాండ్ ఇవ్వటం ఫ్యాన్స్ కి నచ్చకపోయినా.. సల్లు భాయ్ మాత్రం పెళ్లిపెద్దగా కత్రినా వివాహం జరిపించాడు. అందుకే సల్మాన్ ఖాన్ కి మ్యాడ్ ఫ్యాన్స్ ఉంటారు. వన్స్ మనోళ్ళని ఫిక్స్ అయితే ఎప్పటికీ వదలుకోడని ఖాన్ కి బాలీవుడ్ లో మంచి పేరుంది. అయితే ఆ పేరుని నిలబెట్టుకుంటూ.. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసికి సహచర నటుడు విక్కీ కౌశల్ తో దెగ్గరుండీ మూడుముళ్లు వేయించాడు సల్మాన్. అయితే అదే పెళ్ళిలో సల్మాన్ ఖాన్ ఎదురుగా పెద్ద గొడవే జరిగిందట. సల్మాన్ సమక్షంలోనే ఒకరిపై ఒకరు చెప్పులు, కుర్చీలతో దాడులు చేసుకున్నారట. పోయిన ఏడాది 2021 డిసెంబర్ 9న పెళ్లి జరుగగా.. దాదాపు ఏడాదికి ఈ వార్త ఇప్పుడు బయటికొచ్చింది. సీక్రెట్ గా రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న కత్రినా పెళ్లిలో జరిగిన ఈ గొడవ మ్యాటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఈ ఫైటింగ్ సీన్ ని రివీల్ చేసింది కూడా స్వయానా కత్రినా కైఫె.

సెలెబ్రిటీలతో పాటు పరిమిత సంఖ్యలో బంధువులు, అతిథుల సమక్షంలో అట్టహాసంగా జరుగుతున్న కత్రినా పెళ్లిలో ఒక్కసారిగా పెద్ద శబ్ధాలు రావడంతో పెళ్లి పీటలపై నుంచే తాను వెనుదిరిగి చూశానని.. అప్పటికే అక్కడ పెద్ద గొడవ జరుగుతుండటంతో షాక్‌కి గురయ్యాను అని కత్రినా కైఫ్ ఆ సంఘటనని గుర్తుచేసుకుంది. ‘ఆ క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. సరిగ్గా మూడుముళ్లు పడుతున్న సమయంలో నేను ఒకసారి అతిధుల వైపు చూశా. అప్పుడే వెనుకాల నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినపడ్డాయి. ఏంటా గొడవ అని వెనక్కి తిరిగి చూస్తే.. రెండు గ్రూప్స్ కొట్టుకుంటున్నాయి. ఒకవైపేమో నా సిస్టర్స్, మరోవైపు విక్కీ కౌశల్ ఫ్రెండ్స్ గొడవ పడుతుంటే సల్మాన్ వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకుంటూ, దొరికిన కుర్చీలతో కొట్టుకుంటూ తారా స్థాయిలో వాళ్ళ గొడవ జరగటం చూశా. అయితే ఆ గొడవ పట్టించుకోకుండా విక్కీతో మూడుముళ్లు వేయించేసుకున్న. నేను ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లలేకపోయా. అయితే ఆ తర్వాత ఆ గొడవలో ఎవరు గెలిచారో అడగడం మాత్రం మరిచాను’’ అని కత్రినా కైఫ్ నవ్వేసింది.