సిద్ధార్థ్ మల్హోత్రాకి బ్రేకప్ చెప్పిన కియారా - MicTv.in - Telugu News
mictv telugu

సిద్ధార్థ్ మల్హోత్రాకి బ్రేకప్ చెప్పిన కియారా

April 23, 2022

బాలీవుడ్‌లో ఆలియా – రణబీర్ కపూర్‌ల తర్వాత ఖచ్చితంగా పెళ్లిచేసుకుంటారని అందరూ భావించిన కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా జంట విడిపోయారు. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి షేర్షా మూవీలో నటించారు. అప్పటినుంచి ప్రేమలో పడిన వీరు పార్టీలు, టూర్లంటూ ఎంజాయ్ చేశారు. దీంతో అందరూ వీరి పెళ్లి జరుగుతుందని భావించారు. కానీ, ఏమైందో తెలియదు, తమ బంధానికి ఎండ్ కార్డ్ పడిందని వారి సన్నిహితుల వద్ద చెప్పుకొంటున్నారంట.

ఈ విషయాన్ని కియారా స్నేహితులు ధృవీకరిస్తున్నారు. కాగా, ఇటీవలే లైగర్ బ్యూటీ అనన్య పాండే తన ప్రియుడు హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్‌తో విడిపోయింది.