బ్యాక్‌లెస్ పోజుతో రెచ్చిపోయిన మెగా ప్రిన్సెస్ నిహారిక! - Telugu News - Mic tv
mictv telugu

బ్యాక్‌లెస్ పోజుతో రెచ్చిపోయిన మెగా ప్రిన్సెస్ నిహారిక!

June 3, 2020

bbnm b

మెగా ప్రిన్సెస్ నిహారిక ఇన్నాళ్లు సంప్రదాయమైన దుస్తుల్లో తెలుగమ్మాయిలా కనిపించిన సంగతి తెల్సిందే. ఆమె నటించిన మూడు సినిమాల్లో కూడా నిహారిక సంప్రదాయమైన దుస్తులు ధరించింది. ఎక్కడ అందాల ఆరబోత చేయలేదు. కానీ, ఇటీవల నిహారిక రూట్ మార్చినట్టు తెలుస్తోంది. తాజాగా తులిప్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ ఇందుకు ఉదాహరణ. తులిప్ మ్యాగజైన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిహారిక గ్లామర్ లుక్‌ని కవర్ పేజీపై ముద్రించారు. ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తులిప్ మ్యాగజైన్ పై తన ఫోటో రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. 

ఆ ఫొటోలో నిహారిక బ్యాక్ లెజ్ పోజుతో అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇక సినిమాలు, వెబ్ సిరీస్ ఏదైనా అందాలు ఆరబోసేందుకు నిహారిక రెడీ అయినట్టు ఆమె అభిమానులు భావిస్తున్నారు. నిహారిక కూడా ఇకపై గ్లామర్ రోల్స్ చేస్తానని, కథ డిమాండ్ చేస్తే అందాల ఆరబోతకు రెడీ అంటోంది.