వీడియో : యాంకర్స్ అతి ప్రవర్తన.. లైవ్‌లో ఏడ్చేసిన కృతిశెట్టి - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : యాంకర్స్ అతి ప్రవర్తన.. లైవ్‌లో ఏడ్చేసిన కృతిశెట్టి

May 30, 2022

 

ఉప్పెన సినిమాతో హిట్ కొట్టి యువత గుండెల్లో చోటు సంపాదించిన మంగుళూరు భామ కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమెకు ఇటీవల ఓ సినిమాకు సంబంధించి ఉత్తమ నటి అవార్డు రావడంతో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఇద్దరు యాంకర్స్ పాల్గొనగా, ఒకరు మాత్రమే కృతిని వరుసగా ప్రశ్నలు అడిగారు. దాంతో కాసేపయ్యాక మరో యాంకర్ కోపంతో ఊగిపోతూ.. అన్ని ప్రశ్నలు నువ్వే అడుగుతావా? ఇలాగయితే మరి నేనెందుకు? నన్నెందుకు పిలిచారు? ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవరు? కెమెరా ఆఫ్ చేయండి అంటూ కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న కృతిశెట్టి షాకయింది. ఆమె అలా షాక్‌లో ఉండగా, యాంకర్స్ ఇద్దరూ కృతి దగ్గరకు వెళ్లి ఇదంతా ఉత్తిదేనని, కంగారు పడొద్డని చెప్పారు. దాంతో కృతి శెట్టి ఒక్కసారిగా ఏడ్చేసింది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే తనకు చాలా భయం అని చెప్పింది. ఆమె ఏడుపును చూసిన మిగతా టీం మొత్తం సెట్‌లోకి వెళ్లి ఓదార్చారు. కాగా, ఈ వీడియో వైరల్ అవడంతో చూసిన నెటిజన్లు యాంకర్ల వ్యవహారశైలిని ఏకి పారేస్తున్నారు. ఫ్రాంక్ వీడియోలంటే సరదాగా ఉండాలి కానీ, ఎదుటివారిని ఏడ్పించేలా ఉండకూడదని దెప్పి పొడుస్తున్నారు.