actress krithi shetty sign 3 movies in 3 languages
mictv telugu

తగ్గేదేలా అంటున్న కృతిశెట్టి- 3 భాషల్లో సినిమాలు

March 15, 2023

actress krithi shetty sign 3 movies in 3 languages

సౌత్ఇండియా సినిమా పరిధి పెరిగింది. దాంతో పాటు హీరోలు, హీరోయిన్ల అవకాశాలు, స్టార్ డమ్ కూడా బాగా పెరిగాయి. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ హీరోయిన్స్ ఒక్క భాషకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ఇండస్ట్రీలలో మంచి కథలని ఒడిసిపట్టుకొని సినిమాలు చేస్తున్నారు. అలాగే కథలకి పరిధులు లేకపోవడం, ఇతర భాషలలో కూడా అవి రిలీజ్ అవుతూ ఉండటం వలన అలా అన్ని ప్రాంతాల వారికి చేరువ అవుతున్నారు. ఇప్పడు అన్నీ పాన్ ఇండియా మూవీలే, అందరూ పాన్ ఇండియా స్టార్ లే.

ఇది హీరోయిన్స్ కి కూడా భాగా కలిసి వస్తుంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ కృతి శెట్టి మొదటి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తరువాత కూడా వరుసగా రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అయితే తరువాత కృతి శెట్టి నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీ కెరియర్ పట్ అనే టాక్ వచ్చింది. కానీ వాటన్నింటినీ పక్కనపెట్టి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది కృతి.

నాగ చైతన్య హీరోగా చేస్తున్న కస్టడీ మూవీలో కృతి హీరోయిన్ గా చేసింది. ఇది రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీని తర్వాత శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్ లో ఒక సినిమా స్టార్ట్ అవుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా కృతి శెట్టి ఖరారు అయ్యింది. ఇక తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీలో కృతిశెట్టి ఇప్పటికే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రిలీజ్ తర్వాత ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

వీటితో పాటు మరో ప్రాజెక్ట్ కూడా కృతి చేతిలో రెడీగా ఉన్నట్టు సమాచారం. ఇక మలయాళంలోకి కూడా కృతి ఎంటర్ అవబోతోంది. ట్వినో థామస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా ఖరారు అయ్యింది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా రెండు పాన్ ఇండియా సినిమాలు, మూడు సౌత్ ద్విభాష చిత్రాలతో కృతి శెట్టి ఎవరికీ అందకుండా దూసుకుపోతోంది. త్వరలో నేషనల్ క్రష్ రష్మికను పక్కనపెట్టి డైరక్టర్లు కృతికి అవకాశాలు ఇవ్వోచ్చన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.